ఆపిల్ ఐఫోన్ యూజర్లకు కొత్త ఐఓఎస్ 18.1 బీటాను డెవలపర్‌ల కోసం రిలీజ్ చేసింది. కొన్ని ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. దీన్ని స్టాండ్‌అవుట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ గా పిలుస్తారు. ఇందులో ఫోన్ కాల్‌లను రికార్డ్ చేసే చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ చాలా మంది వినియోగదారులకు గేమ్ ఛేంజర్ కావచ్చు. ముఖ్యమైన సంభాషణలను సులభంగా క్యాప్చర్ చేయగలదు. మీ వర్క్ మీటింగ్స్, ఇంటర్వ్యూలు లేదా పర్సనల్ కాల్‌ల కోసం అయినా ఈ కొత్త ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఐఫోన్ ఎంచుకున్న ఏదైనా టెక్స్ట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.మీరు ఆన్సర్ చేసినా లేదా కాల్ చేసినప్పుడు.. మీ ఐఫోన్ రికార్డింగ్‌ని ఎనేబుల్ చేయొచ్చు. మీరు స్క్రీన్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న రికార్డ్ బటన్‌ను నొక్కండి. మీరు రికార్డింగ్‌ని ప్రారంభించిన వెంటనే కాల్‌లో పాల్గొనే వారందరికీ కాల్ రికార్డ్ అవుతుందనే వాయిస్ మెసేజ్ వినబడుతుంది. మీ ఐఫోన్‌లో కాల్ రికార్డ్ ఆడియో సంభాషణను టెక్స్ట్ రూపంలో కూడా అందిస్తుంది. ఈ ట్రాన్స్‌క్రిప్షన్ రియల్ టైమ్‌లోనూ జరుగుతుంది. ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ఇంగ్లీష్ (వివిధ ప్రాంతాలు), స్పానిష్ (అమెరికా, మెక్సికో, స్పెయిన్), ఫ్రెంచ్ (ఫ్రాన్స్), జర్మన్ (జర్మనీ), జపనీస్ (జపాన్), మాండరిన్ చైనీస్ (మెయిన్‌ల్యాండ్ చైనా, తైవాన్), కాంటోనీస్ (మెయిన్‌ల్యాండ్)తో సహా మల్టీ భాషలకు సపోర్టు ఇస్తుంది. చైనా (హాంకాంగ్), పోర్చుగీస్ (బ్రెజిల్) ఈ వైడ్ రేంజ్ లాంగ్వేజీకి సపోర్టు అందిస్తుంది. ప్రపంచంలోని అనేక మంది వినియోగదారులు ఈ ఫీచర్ నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మొత్తం రికార్డింగ్‌ను వినాల్సిన అవసరం ఉండదు. మీ కాల్ సంభాషణలోని ముఖ్యమైన అంశాలను త్వరగా గుర్తించవచ్చు. ఆపిల్ మీ కాల్స్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని రీకాల్ చేయడాన్ని ఈ కొత్త ఫీచర్ సులభతరం చేస్తుంది. ఫోన్ కాల్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్‌తో పాటు ఫోన్ యాప్ అనేక ఇతర అప్‌డేట్‌లను అందిస్తుంది. కాల్ హిస్టరీ కోసం కొత్త సెర్చ్ ఇంటర్‌ఫేస్ గత కాల్‌లను యాప్ ఫోన్ నంబర్‌లకు ఆటోఫిల్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. మీరు ఫోన్ నంబర్ పూర్తిగా టైప్ చేయకుండానే ఫుల్ లిస్టు కనిపిస్తుంది. అదనంగా, కాల్ సమయంలో సిమ్ కార్డ్‌లను ఈజీగా స్విచ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. మల్టీ సిమ్‌లను ఉపయోగించే యూజర్లకు ఈ ఆప్షన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఆడియో, ట్రాన్స్‌క్రిప్షన్ సామర్థ్యాలను నోట్స్ యాప్‌కు కూడా విస్తరించాలని ఆపిల్ యోచిస్తోంది. మీరు ఆడియోను రికార్డ్ చేయవచ్చు. ఐఫోన్ 12 తదుపరి మోడళ్ల నుంచి ప్రారంభించి నోట్స్ యాప్‌లో నేరుగా లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్ పొందవచ్చు. ఈ అప్‌డేట్‌లు కాల్స్, నోట్స్ మరింత సమర్థవంతంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మొత్తంమీద, ఐఓఎస్ 18.1లోని కాల్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ అందిస్తుంది.
0 Comments