తెలంగాణలోని కల్వకుర్తిలో మాజీ ఎంపీ, కీ.శే. జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే 2014లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేది అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.1లక్ష లోపు రుణమాఫీ చేసామని, మళ్లీ జూలై 30 లేదా 31 కి ముందే రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఇక ఆగస్ట్ 2 నుండి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నా.. నేను తిరిగి వచ్చాక ఆగస్ట్ నెలలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మరో వైపు నేను చదువుకున్న తాండ్ర పాఠశాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 50 లక్షలే అడిగాడు. కానీ రూ.5 కోట్లు ఇచ్చి ఆ పాఠశాలను అభివృద్ది చేపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
0 Comments