సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ హఠాన్మరణం
సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ కన్నుముశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సూర్య నారాయణ తెలుగుతో పాటు కన్నడ, హిందీలో భాషల్లో 24 సినిమాలను నిర్మించాడు. శంఖారావం, బజార్ రౌడీ, అల్లుడు దిద్దిన కాపురం, అన్నదమ్ముల సవాల్ వంటి సూపర్ హిట్ సినిమాలను ఉప్పలపాటి సూర్య నారాయణ నిర్మించాడు. సూపర్ స్టార్ కృష్ణకు బావ వరుస అవుతాడు. కృష్ణ రెండో చెల్లెలు లక్ష్మీ తులసిని సూర్య నారాయణ పెళ్లి చేసుకున్నాడు. అంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకు మామ వరుస అవుతాడు. సూర్య నారాయణ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. పొలిటీషియన్‌గానూ మంచి పేరే సంపాదించుకున్నాడు.1985 సంవత్సరంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజక వర్గం నుండి సీనియర్ ఎన్.టి.ఆర్ పై పోటీచేసి ఓటమి పాలయ్యారు.