Posts

Showing posts with the label ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు చట్టం

ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు చట్టం ?

Image
న్యూ ఢిల్లీ లోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బెస్‌మెంట్‌లో భారీ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి చెందిన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకు వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 30 సివిల్స్ కోచింగ్ సెంటర్ల బెస్‌మెంట్‌ను సీల్ చేశామని తెలిపారు. అలాగే 200 కోచింగ్ సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ షెల్లీ ఓబెరియ్‌తో కలసి మంత్రి అతిషి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అధికారులు, విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. డ్రైనేజ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అందువల్ల వరద నీరు బయటకు వెళ్ల మార్గం లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సైతం తన ప్రాథమిక నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని మంత్రి అతిషి వివరించారు. డ్రైనేజిలపై కోచింగ్ సెంటర్ల అక్రమ నిర్మాణం కారణంగా.. వరద నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీంతో ఆ ప్రా...