రాజస్థాన్ లోని జైపూర్ - ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్ లోని మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకు రాగానే బస్సుకు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. దీంతో భారీ శబ్దాలతోపాటు బస్సుకు మంటలు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 12మందికి గాయాలయ్యాయి. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
0 Comments