Ad Code

ముంబయిలో స్కూల్ బస్సుపై కూలిన చెట్టు : విద్యార్థి మృతి, 12 మందికి తీవ్ర గాయాలు

ముంబయిలో గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంబూరు ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక పాఠశాల బస్సుపై మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. ‘యూనివర్సల్ హై స్కూల్’కు చెందిన మినీ బస్సు విద్యార్థులతో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 15 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెట్టు పడటంతో మినీ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన చిన్నారులను సిబ్బంది అతికష్టంపై బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులందరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0 Comments

Close Menu