ఫ్లిప్‌కార్ట్ సిబ్బందిలో 70 శాతం మందికి మాత్రమే ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. దాదాపు 5,000 మందికి ఈసారి వేతన పెంపు ఉండదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఇ-మెయిల్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగులకు బుధవారం తెలియజేసింది. గ్రేడ్ 10 ఆపై స్థాయి ఉద్యోగుల వేతనాల్లో పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, బోనస్‌లు, స్టాక్ ఆప్షన్స్ కేటాయింపులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. ఇప్పటికే ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు ముగిసినట్లు కంపెనీలోని ఓ కీలక వ్యక్తి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇంక్రిమెంట్లు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో తమ వనరులను జాగ్రత్తగా వాడుకోవాలనుకొంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
0 Comments