Ad Code

వాట్సాప్ లో మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్ !


వాట్సాప్ “మెసేజ్ డ్రాఫ్ట్స్” అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారులు తమ అసంపూర్తి సందేశాలను మరింత సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. పాక్షికంగా టైప్ చేసిన సందేశాలను చాట్ థ్రెడ్‌లలో కోల్పోకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఫీచర్ అసంపూర్తిగా ఉన్న సందేశాలను సేవ్ చేయడానికి, గుర్తించడానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త అప్‌డేట్‌తో అసంపూర్తిగా ఉన్న ఏదైనా మెసేజ్ ఆటోమేటిక్‌గా "డ్రాఫ్ట్" లేబుల్‌తో చాట్ లిస్ట్ పైన కనిపిస్తుంది. ఇలా కనిపించడం ద్వారా మెసేజ్ టైప్ చేస్తూ ఏదైనా అనుకోని సందర్భంలో మర్చిపోతే వెంటనే ఆ మెసేజ్‌ను గుర్తుపట్టవచ్చు. చాలా మంది వాట్సాప్ వినియోగదారులకు ముఖ్యంగా వర్క్, పర్సనల్ కమ్యూనికేషన్ రెండింటికీ యాప్‌ని ఉపయోగించే వారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వాట్సాప్ యూజర్లు ఒకేసారి బహుళ చాట్‌లను నిర్వహించడం పరిపాటిగా మారింది. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు సందేశాలు అనుకోకుండా మధ్యలో వదిలివేస్తారు. అందువల్ల డ్రాఫ్ట్ ఫీచర్‌తో వినియోగదారులు ఇకపై అంతులేని చాట్‌ల ద్వారా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదని నిపునులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రాఫ్ట్ మెసేజ్‌లను సెర్చ్ చేసి వారు మధ్యలో వదిలేసిన మెసేజ్‌ను పూర్తి చేయవచ్చు. ఈ ఫీచర్ యూజర్ అనుభవాన్ని, కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్ ఇటీవల కాలంలో ప్రజలు కమ్యూనికేట్ చేసే విధానాన్ని మెరుగుపరచడం, హైడ్ మెసేజెస్, వంటి పీచర్లు ఇప్పటికే అప్‌డేట్ చేసింది. తాజాగా డ్రాఫ్ట్‌ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ మార్పులు యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను పరిష్కరించడంలో, ప్లాట్‌ఫారమ్‌ను రోజువారీ అవసరాలకు మరింత అనుకూలంగా మార్చడంలో యాప్‌నకు సంబంధించిన నిబద్ధతను ప్రతిబింబిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెసేజ్ డ్రాఫ్ట్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వినియోగదారులు తమ వాట్సాప్ యాప్‌ని అప్‌డేట్ చేస్తే ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసంపూర్తిగా ఉన్న సందేశాలను సులభంగా గుర్తించగలిగే విధంగా నిర్వహించడం ద్వారా, రోజువారీ కమ్యూనికేషన్ కోసం వాట్సాప్‌ను మరింత సౌకర్యవంతమైన సాధనంగా మార్చాలని కంపెనీ భావిస్తుందని పేర్కొంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu