దేశీయ మార్కెట్లో షావోమీ 13 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించడంతో ఇవి అందరి దృష్టిని ఆకర్షించాయి. దీని ధర ఐఫోన్ 14 ప్రో రేంజ్ లో ఉంది. ఆ మోడల్ కు పోటీగానే షావోమీ ఈ మొబైల్ ను లాంచ్ చేసింది. యూరోప్ లో 1,299 యూరోల నుంచి ప్రారంభం కానుంది. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.1.13 లక్షల పైమాటే. సెరామిక్ బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అయితే మన దేశంలో ఈ ఫోన్ ధర రూ. లక్ష లోపే ఉండవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 4820 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ ను షావోమీ 13 ప్రో సపోర్ట్ చేయనుంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ఫీచర్ ను ఈ ఫోన్లో అందించారు. లెయికా బ్రాండెడ్ కెమెరాలు ఈ ఫోన్లో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.73 అంగుళాల ఓఎల్ఈడీ 2కే డిస్ప్లేను అందించారు. డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కూడా అందించారు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.
50 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ 13 ప్రో !
by Telugu Lo Computer at February 27, 2023
Labels:
50 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ 13 ప్రో !
,
science
,
smart phones
,
technologe
,
Xiaomi
,
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment