దేశీయ మార్కెట్లోకి ప్రీమియం వన్‌ప్లస్ 11 5జీ, మిడ్-ప్రీమియం వన్‌ప్లస్ 11 ఆర్ విడుదల చేసిన తర్వాత నార్డ్ సిరీస్‌లో భాగంగా అందుబాటు ధరలో లభించే వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. వన్‌ప్లస్ నార్డ్ 3ని వన్‌ప్లస్ జూన్‌లో లాంఛ్ చేయనుందని మైస్మార్ట్‌ప్రైస్ వెల్లడించింది. ఈ ఫోన్ రూ. 30,000లోపు ఉండవచ్చని ఈ పబ్లికేషన్ అంచనా వేసింది. ఇక వన్‌ప్లస్ నార్డ్ 3 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు బ్యాక్ ప్యానెల్లో 50 ఎంపీ మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ షూటర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. గ్లాసీ ఫినిష్‌తో 6.72 ఇంచ్ డిస్ప్లేతో ఈ హాట్ డివైజ్ ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ చిప్సెట్ కలిగిఉంటుంది. యూజర్లు లౌడ్, సైలెంట్ వాల్యూమ్ మోడ్స్ మధ్య స్విచ్ అయ్యేందుకు వీలుగా నార్డ్ 3 డిస్టింక్ట్ అలర్ట్ స్లైడర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 విడుదల !
by Telugu Lo Computer at February 24, 2023
Labels:
5000ఎంఏహెచ్ బ్యాటరీ
,
oneplus
,
science
,
smart phone
,
technologe
,
త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 విడుదల !
,
మైస్మార్ట్‌ప్రైస్ వెల్లడి
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment