Ad Code

చాట్ జీపీటీ సాయంతో వాట్సాప్ మెసేజ్ ?


చాట్ జీపీటీ సాయంతో వాట్సాప్ మెసేజ్ కూడా చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ లో మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే చాట్ జీపీటీ దానికి రిప్లై ఇస్తుంది. అంటే మీ బదులు అదే మీ లాగా రిప్లై ఇస్తుందన్నమాట. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని చాట్ జీపీటీని ప్రవేశపెట్టిన ఓపెన్ ఏఐ గానీ, లేదా వాట్సాప్ యాజమాన్యం మెటా గానీ ధ్రువీకరించలేదు. ఈ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ చాట్ బాట్‌ గత నాలుగు నెలలుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ లో కూడా చాట్ జీపీటీ రాబోతోందని చెబుతున్నారు. పైగా మీ తరఫున మెసేజ్ లకి రిప్లై కూడా చాట్ జీపీటీనే ఇచ్చేస్తుందని చెప్పడంతో అంతా షాకవుతున్నారు. అయితే నేరుగా చాట్ జీపీటీ మీ వాట్సాప్ లోకి రాదు. కానీ, డానియల్ గ్రాస్‌ అనే డెవలపర్‌ రాసిన ఓ పైథాన్‌ స్క్రిప్ట్ సాయంతో చాట్ జీపీటీని వాట్సాప్ లో పొందవచ్చని చెబుతున్నారు. అలా చేసి.. మీరు ఏఐ చాట్ బాట్ కి పర్మిషన్ ఇచ్చేస్తే మీ తరఫున అదే రిప్లై ఇస్తూ ఉంటుంది. ఈ పైథాన్ స్క్రిప్ట్ ని వాడుకుని చాట్ జీపీటీని వాట్సాప్ లో వినియోగించాలి అంటే.. ఓ వెబ్ పేజ్‌ నుంచి మీరు ముందు లాంగ్వేజ్‌ లైబ్రరీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లాంగ్వేజ్ లైబ్రరీని డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు 'వాట్సాప్-జీపీటీ-మెయిన్' అనే ఫైల్ ని ఓపెన్ చేసి.. 'సర్వర్.పీవై' డాక్యుమెంట్ ఎక్జిగ్యూట్ చేయాలి. తర్వాత మీ వాట్సాప్ లోకి చాట్ జీపీటీ వస్తుంది. సర్వర్ రన్ అవుతున్న సమయంలో 'IS' అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. తర్వాత 'పైథాన్ సర్వస్.పీవై' పై క్లిక్ చేయాలి. ఓపెన్ ఏఐ చాట్ పేజ్ లో మీ నంబర్ ను ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మీరు రోబో కాదని నిరూపించుకోవడానికి 'కన్ఫన్ ఐయాన్ నాటే రోబో' క్లిక్ చేయాలి. ఇంక వాట్సాప్ లో చాట్ జీపీటీ మీ తరఫున మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనికి  సంబంధించిన అధికారిక ప్రకటన ఏది లేదు. అటు చాట్ జీపీటీ నుంచి కానీ.. లేదా వాట్సాప్ యాజమాన్యం నుంచి గానీ దీనికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ లేదు. కాబట్టి దీనిని డోన్ లోడ్ చేసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాట్సాప్ ఇంటిగ్రేషన్ అసలైనది కాదని గుర్తిస్తే, మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

Post a Comment

0 Comments

Close Menu