హైదరాబాద్ లోని చెర్లపల్లిలో ఉన్నగ్రేవీటోన్ మోటార్స్ కంపెనీ ఏ ఆర్ క్యూ ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసింది. ఈమధ్యే ఈ బైక్‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్.. హైటెక్స్‌లో జరిగిన ఈ మోటర్ షోలో తెలంగాణ ప్రభుత్వం తరపున లాంచ్ చేశారు. దీని మోడల్ చాలా కొత్తగా ఉంటుందనీ, దీనికి ఉన్న బ్యాటరీని తొలగించుకునే వీలు ఉంది. పైగా దీనికి రెండు బ్యాటరీలు ఉంటాయి. యువతను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. దీన్ని ఫాస్ట్ స్పీడ్ బైక్‌గా తెలిపింది. దీని మోడల్ చాలా కొత్తగా ఉంటుందనీ, దీనికి ఉన్న బ్యాటరీని తొలగించుకునే వీలు ఉంది. ఈ బైక్‌లో హెల్మెట్ పెట్టుకునేందుకు వీలుగా 16 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. హెల్మెట్తోపాటూ ఇంకా చాలా సామాన్లను అందులో ఉంచుకోవచ్చు. ఇండియాలో అన్ని రకాల ప్రదేశాలకూ సెట్ అయ్యే విధంగా ఈ బైక్‌ని తయారుచేసినట్లు కంపెనీ ప్రకటించింది. దీని ఫీచర్స్ గమనిస్తే... ఈ బైక్ మాగ్జిమం 252Nm టార్క్ ఇస్తోంది. దీనికి BLDC హబ్ మోటర్ ఉంది. మోటర్ కెపాసిటీ 6kw ఉంది. లిథియం అయాన్ NMC బ్యాటరీ ఉంది. బ్యాటరీ కెపాసిటీ 4.2Kwగా ఉంది. ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 140 కి.మీ వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీ మెయింటెనెన్స్‌కి రూపాయి కూడా ఖర్చవ్వదని చెబుతున్నారు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. ఈ బైక్‌లో 3 రకాల వేగాలు ఉన్నాయి. అవి 40 కిలోమీటర్ల స్పీడ్ కోసం ఎకో, 65 కిలోమీటర్ల స్పీడ్ కోసం సిటీ, 110 కిలోమీటర్ల స్పీడ్ కోసం స్పోర్ట్ ఉన్నాయి. దీనికి DRLతో కూడిన LED హెడ్ ల్యాంప్ ఉండగా.. టైల్ ల్యాప్ LEDతో ఉంది. ముందు డిస్క్ బ్రేక్ ఉండగా.. వెనక డ్రమ్ బ్రేక్ ఉంది. అలాయ్ వీల్స్ ఉన్నాయి. బయోనిక్ డిజైన్‌తో తయారుచేసిన ఈ బైక్‌పై ఇద్దరు ప్రయాణించేందుకు వీలుంది. ఇది 150 కేజీల బరువు మొయ్యగలదు. ఈ బైక్ ఇతర ఫీచర్స్, ధర ఎంత, బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే వివరాల్ని కంపెనీ త్వరలోనే చెబుతామని అంటోంది.
గ్రేవీటోన్ మోటార్స్ కంపెనీ ఏ ఆర్ క్యూ ఎలక్ట్రిక్ బైక్ !
by Telugu Lo Computer at February 25, 2023
Labels:
elecric bike
,
science
,
technologe
,
గ్రేవీటోన్ మోటార్స్ కంపెనీ ఏ ఆర్ క్యూ ఎలక్ట్రిక్ బైక్
,
ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 140 కి.మీ వెళ్లొచ్చు
,
హెల్మెట్ పెట్టుకునేందుకు వీలుగా 16 లీటర్ల బూట్ స్పేస్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment