షావోమి తాజాగా విద్యార్థుల కోసం స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రామ్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్టూడెంట్స్‌కు షావోమి ప్రొడక్టులపై రూ. 2 వేల వరకు తగ్గింపు వస్తుంది. అంతేకాకుండా సెక్యూరిటీ అండ్ ఎక్సెటెండెడ్ వారంటీ ప్లాన్స్‌పై 50 శాతం తగ్గింపు పొందొచ్చు. షావోమి ఎంఐ స్టోర్ యాప్ ద్వారా ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. అయితే స్టూడెంట్స్ తొలిగా యూనిడేస్ పోర్టల్‌లో వారి వివరాలను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా షావోమి స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు కంపెనీకి చెందిన పలు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, ఇతర ప్రొడక్టులపై డిస్కౌంట్, ఇతర బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. యూనిడేస్ అనేది డిస్కౌంట్ ఫోకస్డ్ వెబ్సైట్. స్టూడెంట్స్ దీని ద్వారా పలు రకాల స్పెషల్ ఆఫర్లు పొందొచ్చు. ప్రపంచంలోని అందరు స్టూడెంట్స్‌కు ఈ పోర్టల్ అందుబాటులో ఉంది. యాపిల్ సహా వివిధ బ్రాండ్లకు చెందిన ప్రొడక్టులపై విద్యార్థులు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఉచితంగానే యూనిడేస్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. స్పెషల్ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు షావోమి స్మార్ట్‌ఫోన్స్, రెడ్మి ఫోన్లపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్స్‌పై అయితే 45 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. లైఫ్ స్టైల్ ప్రొడక్టులపై అయితే 70 శాతం దాకా తగ్గింపు పొందొచ్చు. అలాగే ఎంఐ ప్రొటెక్ట్, ఎక్సెండెడ్ వారంటీ, కంప్లీట్ ప్రొటెక్ట్ వంటి సెక్యూరిటీ ప్లాన్స్‌పై 50 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఆఫర్ పొందాలని భావించే వారు ముందుగా ఎంఐ స్టోర్ యాప్‌లోకి వెళ్లాలి. తర్వాత స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రామ్ పేజ్‌లోకి వెళ్లాలి. తర్వాత యూనిడేస్లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు ప్రోమో కోడ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఎంఐ స్టోర్ యాప్‌లోకి రావాలి. ఇప్పుడు మీకు నచ్చిన ప్రొడక్టును యాడ్ చేసుకోవాలి. పేమెంట్ చేసే టప్పుడు ప్రోమో కోడ్ ఉపయోగించాలి.
షావోమి స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రాం !
by Telugu Lo Computer at February 20, 2023
Labels:
Redmi
,
science
,
technologe
,
ఆఫర్లకు ఎంఐ స్టోర్ యాప్‌లోకి వెళ్లాలి
,
ఎంఐ ప్రొటెక్ట్
,
ఎక్సెండెడ్ వారంటీ
,
కంప్లీట్ ప్రొటెక్ట్ వంటి సెక్యూరిటీ ప్లాన్స్‌పై 50 శాతం తగ్గింపు
,
షావోమి స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రాం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment