ట్విట్టర్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన పెయిడ్ బ్లూ చెక్‌మార్క్ పద్ధతిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అమలు చేయాలని మెటా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 'ట్విట్టర్ బ్లూ' పేరుతో పెయిడ్ వెరిఫికేషన్‌ను ఇప్పటికే ట్విట్టర్ అందుబాటులోకి తెచ్చింది. ట్విట్టర్ బ్లూ యూజర్లకు ఇతర యూజర్ల కంటే కొన్ని అదనపు ఫీచర్లను కల్పించింది. మెటా కూడా పెయిడ్ సబ్‌స్ర్కైబర్లకు బ్లూ చెక్‌మార్క్‌తో పాటు పలు అదనపు ఫీచర్లు ఇవ్వాలని భావిస్తున్నదని టెక్‌డ్రాయిడర్ సంస్థ అంచనా వేస్తున్నది. ఇందుకు సంబంధించి మెటా హెల్ప్ సెంటర్ పేజీలో చేసిన మార్పుల స్క్రీన్‌షాట్లను ట్వీట్ చేసింది. అధికారికంగా మాత్రం మెటా సంస్థ పెయిడ్ చెక్‌మార్క్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
0 Comments