రియల్‌ మీ నుంచి కోకా కోలా ఫోన్ విడుదల


రియల్ మీ కోకా కోలా ఎడిషన్ ఫోన్, రియల్ మీ 10 ప్రో 5జీ ని మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మీరు వెనుక వైపున డ్యూయల్ టోన్ డిజైన్ వుంది. వెనుక వైపు నలుపు, ఎరుపు కోకా కోలా రంగులున్నాయి. దీనితో పాటు రెండు కంపెనీల బ్రాండింగ్ వెనుక ప్యానెల్లో వుంది. రియల్‌ మీ 10 ప్రో 5జీ కోకా కోలా ఎడిషన్ గత సంవత్సరం లాంచ్ అయిన రియల్‌ మీ 10 ప్రో 5జీ లాగా ఉంటుంది. వాస్తవానికి కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను  గత సంవత్సరం మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ కోకా-కోలాతో కలిసి పని చేసినందున, దీని కారణంగా రియల్ మీ ఈ ఫోన్ ను  మరోసారి కొత్త డిజైన్లో లాంచ్ చేసింది. రియల్ మీ ఈ కొత్త ఫోన్ ధరను రూ.20,999గా నిర్ణయించింది. మీరు ఈ ఫోన్ని ఫ్లిప్కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్సైట్, రియల్ మీ స్టోర్ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  6.7 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది 120hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ Qualcomm Snapdragon 695 5G SoCపై పని చేస్తుంది. ఇందులో మీరు 8 జీబీ వరకు ర్యామ్ వుంది. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను పొందుతారు. మరో 2-మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనుంది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్  5000 mAh బ్యాటరీని కలిగి వుంది.  ఇది 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ ఫోన్ బ్యాటరీని 20 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org