వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్ హార్ట్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ ఫిబ్రవరి 12 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్ హార్ట్ డేస్ సేల్‌లో షాపింగ్ చేసే వారికి ఒక్క రూపాయికే ఎలక్ట్రిక్ స్కూటర్ పొందే ఛాన్స్ లభిస్తుంది. 1,40,223వ కస్టమర్‌కు ఈ అవకాశం ఉంటుంది. అంటే ఫ్లిప్ హార్ట్ డేస్ సేల్ పాల్గొని ఏ ప్రొడక్ట్ కొనుగోలు చేసినా కూడా వారికి ఈ ఛాన్స్ లభించొచ్చు. ఎవరైతే 1,40,223 కస్టమర్‌గా ఉంటారో వారికి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఒకాయ ఫాస్ట్ ఎఫ్2బీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉచితంగా అందిస్తుంది. ఎవరైతే 1,40,223 కస్టమర్‌గా నిలుస్తారో వారికి ఫ్లిప్‌కార్ట్ నెల రోజుల్లోగా వివరాలు తెలియజేస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా ఒక్క రూపాయికే పొందాలో ప్రాసెస్ తెలియజేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న సేల్‌లో పాల్గొన్న వారికే ఈ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఫ్రీడమ్ ఎల్ఐ2, ఫాస్ట్ ఎఫ్2బీ, ఫాస్ట్ ఎఫ్4వంటి మోడళ్లపై రూ .5 వేల తగ్గింపు లభిస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి ఇది మంచి ఛాన్స్. ఫ్రీడమ్ మోడల్‌ను రూ. 74,899కు కాకుండా రూ. 69,899కే కొనొచ్చు. దీని రేంజ్ 75 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అలాగే ఫాస్ట్ ఎఫ్2బీ మోడల్‌ను అయితే రూ. 91,999కు కాకుండా రూ. 86,999కు కొనొచ్చు. దీని రేంజ్ 80 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. అలాగే ఫాస్ట్ ఎఫ్4 మోడల్‌ను రూ. 1,13,999కు కాకుండా రూ. 1,08,999కు కొనొచ్చు. దీని రేంజ్ 160 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలని భావించే వారు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. ఒకాయ ఇటీవలనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని పేరు ఫాస్ట్ ఎఫ్ 3. ఈ కొత్త స్కూటర్ ప్రారంభ ధర రూ. 99,999గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 125 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది.
ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్ హార్ట్ డేస్ సేల్ లో రూపాయికే ఎలక్ట్రిక్ స్కూటర్ !
by Telugu Lo Computer at February 12, 2023
Labels:
electric scooter
,
filpkart
,
science
,
technologe
,
ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్ హార్ట్ డేస్ సేల్ లో రూపాయికే ఎలక్ట్రిక్ స్కూటర్
,
వాలెంటైన్స్ డే
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment