లావా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. భారత్‌లో యువ 2 ప్రో ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ. 7999లకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో కూడా వస్తుంది.లావా యువ 2 ప్రో ఫోన్ గ్లాస్ వైట్, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అందులో అదనపు 3GB వర్చువల్ ర్యామ్‌కు సపోర్టు వస్తుంది. దీని ధర రూ. 7999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లావా రిటైల్ నెట్‌వర్క్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు డౌట్‌నట్ కోర్సు మెటీరియల్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీ-లోడ్ చేసుకోవచ్చు. 6.5-అంగుళాల HD+ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. MediaTek Helio G37 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయంలో ఫోన్ ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన బ్లోట్‌వేర్‌తో ఫోన్ రాలేదని కంపెనీ పేర్కొంది. కొత్తగా లాంచ్ చేసిన ఫోన్ ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ అవుతుందని, రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తుందని లావా వెల్లడించింది. 13-MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. ముందు భాగంలో, ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5-MP కెమెరాను కలిగి ఉంది. బ్యూటీ, HDR, నైట్, పోర్ట్రెయిట్, AI, ప్రో, పనోరమా, స్లో మోషన్, ఫిల్టర్‌లు, GIF, టైమ్‌లాప్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి కెమెరా ఫీచర్‌లను కూడా ఫోన్ అందిస్తుంది. టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు కూడా యూజర్లకు ‘Free Home Service’ను అందిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్ల ఇంటి వద్దకే సర్వీసులను అందించనుంది.
0 Comments