మార్కెట్లోకి ఎస్సెల్ ఎనర్జీ కంపెనీ గెట్ 1 అనే ఎలక్ట్రిక్ బైసైకిల్ ని తీసుకొచ్చింది. దీనికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని లేదు. దీన్ని నడపడానికి లైసెన్స్ కూడా ఉండాల్సిన అక్కర్లేదు. ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. బ్యాటరీ కెపాసిటీ మారుతుంది. ఒక దానిలో 48 వీ 13 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే మరో దానిలో 48 వీ 16 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 13 ఏహెచ్ బ్యాటరీ ఉన్న వేరియంట్ ధర రూ. 41,500గా ఉంది. అదేవిధంగా 16 ఏహెచ్ బ్యాటరీ ఉన్న వేరియంట్ ధర రూ. 43,500గా ఉంటుంది. అంటే ధర అందుబాటులోనే ఉందని చెప్పుకోవచ్చు. కేవలం 10 పైసల ఖర్చుతో కిలోమీటర్ వెళ్లొచ్చని కంపెనీ చెబుతుంది. ఇందులో రియర్ డబుల్ షాకర్, టెయిల్ లైట్ విత్ ఇండికేటర్స్, ఎక్స్ట్రా స్టోరేజ్ బాక్స్, ప్రొజెక్టర్ లెన్స్ హెడ్ లైట్, ఫ్రంట్ బాస్కెట్, ఫ్రంట్ డబుల్ షాకర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. వాటర్ ప్రూఫ్ కేబుల్. ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్లు వెళ్లొచ్చు. చార్జింగ్ టైమ్ 5 నుంచి 6 గంటలు పడుతుంది. బ్యాటరీ బ్యాకప్ ఇండికేటర్, డ్రమ్ బ్రేక్స్, లిథియం అయాన్ బ్యటరీ, పార్కింగ్ లైట్, ఫ్రంట్ అండ్ రియర్ బ్రేక్ సెన్సార్ టు కట్ ఆఫ్ మోటార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనిపై రెండేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. బ్యాటరీకి ఇది వర్తిస్తుంది. అదే ఇతర భాగాలపై అయితే ఏడాది పాటు వారంటీ లభిస్తుంది. ఇందులో కంపెనీ 250 వాట్ 48 వోల్ట్ బీఎల్డీసీ మోటార్‌ను అమర్చింది. దీని బరువు 39 కేజీలు.
ఎస్సెల్ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్ బైసైకిల్ !
by Telugu Lo Computer at February 23, 2023
Labels:
Electric Bicycles
,
science
,
technologe
,
ఎస్సెల్ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్ బైసైకిల్
,
టెయిల్ లైట్ విత్ ఇండికేటర్స్
,
రియర్ డబుల్ షాకర్
,
రెండు వేరియంట్లలో
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment