Ad Code

ఫ్లిప్‌కార్ట్ లో వీవో V50 5G మోడల్‌పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్ వీవో V50 5G మోడల్‌పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. గతంలో భారీ ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి రావడం విశేషం. వీవో V50 5G అసలు ధర 39,999 రూపాయలుగా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 18 శాతం డిస్కౌంట్ తో దీనిని 32,999 రూపాయలకే విక్రయిస్తోంది. ఇదే కాకుండా బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు పొందే వీలుంది. ఎస్‌బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడే వారికి అదనంగా 1,650 రూపాయల నుంచి రూ. 3,075 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.తక్కువ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ అనుభవం పొందాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. మొత్తంగా రూ.10 వేల తగ్గింపు వస్తుంది.  ఇందులో 6.77 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ అమర్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల వీడియోలు చూడటం లేదా గేమ్స్ ఆడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఇవ్వడం గమనార్హం. ఇంతటి నాణ్యమైన డిస్‌ప్లే ఈ ధరలో లభించడం నిజంగా బాంబు పేల్చిన వార్తే. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉండటం వల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉంటుంది. కెమెరా విభాగంలో వెనుక భాగంలో జైస్ (Zeiss) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేయాలనుకునే వారికి ఈ సెటప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం విశేషం. ఫోటోలు, వీడియోలు దాచుకోవడానికి 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 12GB వరకు ర్యామ్ సౌకర్యం ఉంది. ఇందులో 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. పాత ఫోన్ మార్చుకోవాలనుకునే వారి కోసం 30 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu