తెలంగాణ అసెంబ్లీ తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు. 'తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15శాతం కోసం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టాన్ని రూపొందించామని తెలిపారు. పిల్లల్ని కనగలం, వారి బుద్ధుల్ని మనం కనలేం అన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం. సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం తల్లిదండ్రుల కోసం ఈ చట్టం తెచ్చింది. భక్తితో లేదా భయంతో తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నదే మా ఆలోచన. ప్రేమలు పంచాల్సి చోట చట్టం తేవడం బాధగా ఉంది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రతి కుమారికి బుద్ధి చెప్పే చట్టం ఇది. ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం ఈ చట్టం కిందకి వస్తారు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారులను సామాజిక బహిష్కరణ చేయాలి'అని ఆయన సూచించారు.
0 Comments