Ad Code

28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ లను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు : ట్రాయ్


భారత టెలికాం రంగాన్ని నియంత్రించే సంస్థ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతంలోనే 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ గురించి దిశా నిర్ధేశం అందించింది. 2022 లో జరిగిన సమావేశం నుంచి ప్రతీ టెలికాం కంపెనీ కూడా 28 రోజుల ప్లాన్ తో పాటు కనీసం ఒక్కటైనా 30 రోజుల వ్యాలిడిటీ మరియు క్యాలెండర్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్ తన యూజర్ల కోసం అందించాలని ఆదేశించింది. టెలికాం కంపెనీలు అందించే 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటు 30 మరియు నెల రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా అందించాలి. అయితే, ఎక్కడా కూడా 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ లను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. అయితే, 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ తో పాటు 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా యూజర్ కోసం ఎక్కువగా ఆఫర్ చేయాలనీ మాత్రమే ఆదేశించింది. తద్వారా యూజర్ కు అనువైన, అనుకూలమైన ప్లాన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుందని ట్రాయ్ తెలిపింది. అయితే, సోషల్ మీడియాలో అసలు విషయాన్ని చెప్పకుండా "ప్రభుత్వం 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దు చేసి 30 రోజుల ప్లాన్ తప్పనిసరి చేసింది" అని అసత్య ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ ఛద్దా 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ వలన ప్రజలకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వానికి వినతి చేశారు. అంతేకాదు, వాటి స్థానంలో కొత్త 30 రోజులు మరియు నెల రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకురావాలని వినతి కూడా చేశారు. ఈ వినతి పై దృష్టి సారించిన ప్రభుత్వం కొత్త దిశ నిర్దేశాలు అందించింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, అన్ని టెలికాం కంపెనీలు కూడా 28 రోజులకు దీటుగా 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా తన యూజర్ల కోసం అందించాల్సి ఉంటుంది. కొత్త ఆదేశాల ప్రకారం 28 రోజుల ప్లాన్లు కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో 30 రోజుల ప్లాన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త చర్య వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలుగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu