Ad Code

ట్రంప్‌కు వ్యతిరేకంగా, 'నో కింగ్స్' నిరసనలు : 50 రాష్ట్రాలలో 3,200కు పైగా నిరసన ప్రదర్శనలు


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 'నో కింగ్స్' నిరసనలు చేపట్టారు. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు పాల్గొని, నినాదాలు చేశారు. మొత్తం 50 రాష్ట్రాలలో 3,200కు పైగా నిరసనలు జరుగుతున్నాయి. ఇరాన్ యుద్ధంపై వ్యతిరేకత కూడా ఈ తాజా ప్రదర్శనలకు పాక్షికంగా కారణమని నిర్వాహకులు తెలిపారు 50 రాష్ట్రాల్లో 3 వేల చోట్ల నో కింగ్స్‌ నిరసనలు చేపట్టారు. 90 లక్షల మందికి పైగా రోడ్లపైకి వచ్చారు. లాభాల కోసం యుద్ధమా అంటూ నినాదాలు చేశారు. అమెరికా సైనికులు అమ్మకానికి లేరని నినదించారు. గత జూన్‌లో జరిగిన తొలి ఉద్యమంతో పోలిస్తే, ఈ నిరసనలో పాల్గొన్నవారి సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో యూఎస్ మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఇడాహో, వ్యోమింగ్, మోంటానా, ఉటా వంటి రిపబ్లికన్ మొగ్గు ఉన్న రాష్ట్రాల వారు కూడా తాజా నిరసనల్లో భారీగా పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంపై వ్యతిరేకత కూడా ఈ తాజా ప్రదర్శనలకు పాక్షికంగా కారణమని నిర్వాహకులు తెలిపారు . 'లాభాల కోసం యుద్ధమా? మా సైనికులు అమ్మకానికి లేరు' అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. కాగా, ఈ నిరసనలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు. సెయింట్ పాల్‌లోని మిన్నెసోటా క్యాపిటల్ లాన్ వద్ద వేలాది మంది ప్రజలు గుమిగూడి తమ నిరసనను శాంతియుతంగా తెలియజేశారు. కొందరు ఆందోళనకారులు అమెరికా జెండాలను తలకిందులుగా పట్టుకుని దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని సూచించారు. అమెరికా వెలుపల లండన్, పారిస్, రోమ్ వంటి నగరాల్లోనూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. రోమ్‌లో వేలాది మంది యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu