కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగిన ఎన్డీయే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమం, హెల్త్‌కేర్, ప్రజలకు ఆర్థిక భద్రత వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద, వితంతువులు, 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.3,000 చొప్పున వెల్ఫేర్ పెన్షన్. ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల ఉచిత తాగునీరు. పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ. ఓనం, క్రిస్మస్ పండుగల్లో పేద కుటుంబాలకు ఉచితంగా ఒక ఎల్‌పీజీ సిలెండర్. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్. రైతుల ఆర్థిక భద్రతకు భరోసాగా అన్ని అత్యవసర వ్యవసాయ పంటలకు మద్దతు ధరకు హామీ. పేద కుటుంబాల మహిళలకు నిత్యావసరాలు, మందులు కొనుక్కునేందుకు ప్రతినెలా రూ.2,500 విలువచేసే 'ఫుడ్ హెల్త్ సెక్యూరిటీ కార్డ్'. శబరిమల, గురవాయూర్ ఆలయం వంటి ప్రధాన ఆలయాల పరిరక్షణ, నిర్వహణకు దేవస్వోమ్ బోర్డుల్లో సంస్కరణలు. కేరళలో ప్రపంచ స్థాయి హెల్త్‌కేర్ సౌకర్యాలతో కూడిన ఎయిమ్స్ ఏర్పాటు. తిరువనంతపురం-కానూర్‌ను కలిపే హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్.
0 Comments