ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, గాజువాక ఎల్.వి. నగర్ లోని ఒక నేవీ ఉద్యోగి ఇంట్లో ఆయన ప్రియురాలు దారుణ హత్యకు గురయింది. పోలీసుల కథనం ప్రకారం నేవీ ఉద్యోగి రవీంద్ర భార్య డెలీవరీ కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే రవీంద్రకు గత కొంతకాలంగా మౌనిక అనే యువతితో వివాహేతర సంబంధం ఉంది. ప్రియురాలు మౌనిక ను హత్య చేసి ఆమె డెడ్ బాడీని ముక్కలుగా నరికి శరీరభాగాలను ఫ్రిడ్జ్ లో కొన్నింటిని, మరికొన్నింటిని బాక్సులో పెట్టాడు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని శరీర భాగాలు మిస్ కావడంతో వాటిని కాల్చివేసినట్లు నిందితుడు రవీంద్ర పోలీసుల విచారణలో వెల్లడించారు. ఎక్కడ పారేసావన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రవీంద్రను తమ దైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. రవీంద్ర, మౌనిక ఇద్దరికీ పెళ్లయింది. అయితే వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మౌనిక తనను పెళ్లి చేసుకోవాలని, తనకు ఆస్తులు రాసివ్వాలని, నగదు భారీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని రవీంద్ర పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. అందుకే తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆమెను తన ఇంటికి పిలిపించుకుని హత్య చేసినట్లు రవీంద్ర పోలీసుల విచారణలో అంగీకరించాడు. మౌనికను హత్య చేసిన తర్వాత రవీంద్ర కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో ప్రియురాలిని హత్య చేసిన నేవీ ఉద్యోగి !
March 30, 2026
0
Tags