ఇరాన్ శక్తిమంతమైన సైనిక విభాగం ఐఆర్ జీసీ నావికాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి కన్నుమూసినట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తంగ్సిరి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందని, అలీ రెజా తుదిశ్వాస వదిలారని ఐఆర్ జీసీ అధికారిక వెబ్‌సైట్ 'సెపా న్యూస్' వెల్లడించింది. తమ కీలక కమాండర్ మృతికి కారణమైన వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
ఐఆర్జీసీ చీఫ్ అలీ రెజా కన్నుమూత : అధికారికంగా ప్రకటించిన ఇరాన్
March 31, 2026
0
Tags