ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారే భవిష్యత్తులో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు !


టాప్ ప్రోగ్రామర్లు ఇప్పుడు స్వయంగా కోడింగ్ రాయడం మానేశారని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ కిడ్మత్ తెలిపారు. దానికి బదులుగా వారు కేవలం ఇన్స్ స్ట్రక్షన్స్ ఇస్తూ, ఫలితాలను సరిచూసే 'టెస్ట్ ఫంక్షన్స్' రాస్తున్నారు. మిగతా పనినంతా కృత్రిమ మేధ చూసుకుంటోంది. తన స్టార్టప్‌లోని ఒక ప్రోగ్రామర్ చేసే పనిని ఆయన ప్రస్తావించారు. ఆ ప్రోగ్రామర్ సాయంత్రం ఏఐకి పని అప్పజెప్పి నిద్రపోతే, తెల్లవారుజామున 4 గంటలకల్లా ప్రాజెక్ట్ పూర్తవుతోంది. ఇదే పనిని గూగుల్‌లో చేయాలంటే 10 మంది ప్రోగ్రామర్లు, ఆరు నెలల సమయం పట్టేది' అని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాముఖ్యత తగ్గుతుందని భావిస్తున్న వారికి ఎరిక్ ఒక కొత్త కోణాన్ని చూపారు. నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు డిమాండ్ తగ్గకపోగా, మరింత పెరుగుతుందన్నారు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారే భవిష్యత్తులో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారని చెప్పారు. కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు, అకౌంటింగ్, బిల్లింగ్, లాజిస్టిక్స్ తదితర ఖర్చుతో కూడిన వ్యాపార కార్యకలాపాలను కూడా ఏఐ సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments