Ad Code

మండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్


తెలంగాణ శాసనమండలి నుంచి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, తాతా మధు సహా బీఆర్‌ఎస్ సభ్యులను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు సభలోనే ఉండి నిరసనకు దిగారు. సీట్లపైకి ఎక్కి మరీ నిరసన తెలపడంతో వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్‌కు చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్షల్స్‌, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 'గెటవుట్' అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీలాంటి వారు సభకు రావడం సరికాదు. పెద్దల సభ గౌరవం కాపాడాలి' అని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu