గత వారం రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సోమవారం కాస్త కోలుకుంది. ఒక్క రోజే 130 పైసలు లాభపడి, డాలరుతో పోలిస్తే 93.59 వద్ద నిలిచింది. మార్కెట్లో డాలర్ల కొరతను సృష్టించి, రూపాయి విలువను మరింత తగ్గించేలా సాగుతున్న 'ఊహాజనిత కార్యకలాపాల'పై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. అన్ని బ్యాంకులు ఆన్‌షోర్ డెలివరబుల్ మార్కెట్‌లో తమ నెట్ ఓపెన్ పొజిషన్ ను $100 మిలియన్లకు మించరాదని ఆర్‌బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10 నాటికి ఈ నిబంధనను పాటించాలని స్పష్టం చేయడంతో, ప్రైవేట్ మరియు విదేశీ బ్యాంకులు తాము అక్రమంగా నిర్వహిస్తున్న దాదాపు $18 బిలియన్ల ఆర్బిట్రేజ్ ట్రేడ్‌లను సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మార్కెట్లోకి డాలర్ల ప్రవాహం పెరిగి రూపాయికి తాత్కాలికంగా ఊపిరి అందింది.
0 Comments