హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపి, ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సదరు మహిళ తన ఇద్దరు పిల్లలు కార్తీక్ (12), కౌశిక్ (10) లతో కలిసి రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటుంది. కుటుంబ తగాదాల కారణంగా భర్త ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. అయితే, అతను ఇటీవలే రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ తన ఇద్దరు కొడుకులను చంపి, ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన స్థానికులు కూకట్‌పల్లి పీఎస్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టోమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments