దేశంలో బంగారం, వెండి ధరలు నేడు తగ్గాయి. గత వారం చివరి రెండు రోజుల్లో కొంత పుంజుకొన్నప్పటికీ మళ్లీ తిరోగమనం బాట పట్టాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర సుమారు 4,430.00 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు 1,47,280 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 1,35,000 రూపాయల వద్ద లభిస్తోంది. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న అంచనాలను తగ్గించాయి. రూపాయి విలువ భారీగా పతనం కావడం కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 1,500 తగ్గి రూ. 1,47,280కి చేరగా, 22 క్యారెట్ల పసిడి రూ. 1,35,000కి తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,35,150, 24 క్యారెట్లు రూ. 1,47,430, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,34,900, 24 క్యారెట్లు రూ. 1,47,180గా నమోదైంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పూణేల్లో 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం రూ. 1,35,000, 24 క్యారెట్లు రూ. 1,47,280 వద్ద లభిస్తోంది.
0 Comments