ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి ₹5 లక్షల వరకు క్యాష్‌లెస్‌గా ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స అందుతుంది. ముఖ్యంగా పెద్ద శస్త్రచికిత్సలు, తీవ్రమైన వ్యాధుల చికిత్సలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దేశంలోని పేద మరియు బలహీన వర్గాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే ఈ పథకం లక్ష్యం. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹5 లక్షల వరకు హెల్త్ కవరేజ్ అందిస్తుంది. క్యాష్‌లెస్ & పేపర్‌లెస్ ట్రీట్‌మెంట్ మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల సంఖ్యకు పరిమితి లేకపోవడం గమనార్హం. ముందస్తు & చికిత్స తర్వాత ఖర్చులు కూడా కవరేజ్‌లో భాగమవుతాయి. చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ స్కీమ్‌లో నమోదు అయ్యాయి. దీంతో మంచి సదుపాయాలతో ఉన్న ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స పొందవచ్చు.
0 Comments