కొండేక్కిన కోడి మాంసం ధర మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా అమ్మకాలు జరుగుతున్నాయి. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు ఈ వారం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360 - రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా ఉండటంతో చికెన్ కు గిరాకీ ఏర్పడింది. వెరసి స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది.
0 Comments