అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ S25 FEపై డిస్కౌంట్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ S25 FEని లాంచ్ సమయంలో ధర రూ.59,999. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ మోడల్. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మరొక వేరియంట్. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.50,499కి లభిస్తోంది. అంటే నేరుగా రూ.9,500 డిస్కౌంట్. అమెజాన్ పే బ్యాలెన్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ.1,514 డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం సేవింగ్స్ దాదాపు రూ.11,000 వరకు వస్తుంది. ఈ డీల్‌తో S25 FE తన సెగ్మెంట్‌లో అతి సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఒకటిగా మారింది. 6.7 అంగుళాల డైనమిక్ ఆమోలెడ్ 2X డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ హై రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. కలర్ బ్రైట్‌గా, విజువల్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. ఫోన్ నీరు, దుమ్ము నుంచి ప్రొటెక్షన్ ఫీచర్ కలిగి ఉంది. దీంతో ఫోన్ రఫ్ యూజ్ చేసినా మంచి డ్యూరెబిలిటీ ఉంటుంది. ఈ ఫోన్ Exynos 2400 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఈ ప్రాసెసర్ చిప్‌సెట్ వేగవంతమైన, నమ్మదగిన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మల్టీటాస్కింగ్, హెవీ యాప్‌లను సులభంగా నడపవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. శాంసంగ్ ఏడు సంవత్సరాల వరకు మేజర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇస్తుంది. దీంతో ఫోన్ ఎక్కువ కాలం కొత్తగా సురక్షితంగా ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP సెన్సార్‌తో OIS సపోర్ట్ ఉంది. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ వైడ్ ఫోటోలు తీయడానికి సహాయపడుతుంది. 8MP టెలిఫోటో లెన్స్ జూమ్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది. వివిధ లైటింగ్ పరిస్థితుల్లో కూడా క్లియర్ ఫోటోలు తీయవచ్చు. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌కు ఈ ఫోన్స్ మంచి ఆప్షన్స్. ఫోన్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వినియోగించవచ్చు. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అవసరమైనప్పుడు త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ఆధునిక వినియోగదారులకు ఈ ఫీచర్ మంచి సౌలభ్యం ఇస్తుంది.
అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ S25 FEపై డిస్కౌంట్ ఆఫర్ !
March 28, 2026
0
Tags