దేశీయ మార్కెట్లో టెక్నో స్పార్క్ 50 5జీను టెక్నో కంపెనీ భారత అధికారికంగా విడుదల చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో పోటీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్, భారీ బ్యాటరీ, మంచి బిల్డ్, ప్రత్యేక కనెక్టివిటీ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది రోజంతా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేయబడింది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీనిలో MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మల్టీటాస్కింగ్ కు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ లో 4GB అండ్ 6GB RAM వేరియంట్లతో పాటు, వర్చువల్ ర్యామ్ సాయంతో మొత్తం 18GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. స్టోరేజ్ 128GB కాగా, మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. దీనివల్ల శబ్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా కాల్స్ క్లియర్‌గా వినిపిస్తాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై మొబైల్ పని చేస్తుంది. ఈ ఫోన్ ముఖ్యమైన ప్రత్యేకత దాని రగ్గడ్ డిజైన్. ఇది MIL-STD-810H సర్టిఫికేషన్ ఉండడం వల్ల 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా ఫోన్‌కు పెద్దగా నష్టం కలగదు. ఇంకా IP64 PRO రేటింగ్ వల్ల నీరు, దుమ్ము నుంచి రక్షణ కల్పిస్తుంది. సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ మెరుగ్గా ఉండేలా కొన్ని ప్రత్యేక ఫీచర్లు అందించారు. ఇంకా UPS 3.0 టెక్నాలజీ వల్ల UPI వంటి డిజిటల్ పేమెంట్స్‌ను 2 రెట్లు వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది అలాగే 4×4 MIMO సపోర్ట్ వల్ల డౌన్‌లోడ్ స్పీడ్స్‌ను 82% వరకు పెంచుతుంది. ఇంకా నెట్‌వర్క్ లేకుండా కమ్యూనికేషన్ పొందవచ్చు. 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డివైసులతో నెట్‌వర్క్ లేకుండా కనెక్ట్ అయ్యే సౌకర్యం ఇందులో ఉంది. ఈ మొబైల్ కు 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే .. 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 50 5జీ విడుదల
by Telugu Lo Computer at March 27, 2026
Labels:
business
,
mid-range segment
,
national
,
robust build quality
,
technology
,
Tecno Spark 50 5G Launched
,
this phone aims to attract consumers with its massive battery
,
unique connectivity features
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment