Ad Code

వృత్తి ఉద్యోగాలు, న్యూరోడైవర్జెంట్ లను ఏఐ రీప్లేస్ చేయలేదు : అలెక్స్ కార్ప్ వెల్లడి


వృత్తి ఉద్యోగాలు, న్యూరోడైవర్జెంట్లను ఏఐ రీప్లేస్ చేయలేదని పాలంటిర్ అనే ఏఐ, డేటా అనలైటిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో అలెక్స్ కార్ప్ వెల్లడించారు. మీరు ఈ రెండు గ్రూపుల్లో ఉంటే ఏఐ మిమ్మల్ని ఏమీ చేయలేదంటూ చెప్పుకొచ్చారు.  టెక్నాలజీ బిజినెస్ ప్రోగ్రామింగ్ నెట్‌వర్క్ పాడ్‌కాస్ట్‌లో కార్ప్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో ఏఐ ఇంటిగ్రేషన్ గురించి చర్చించారు. ప్రతి రంగంలో ఏఐ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో జాబ్ మార్కెట్ ఫ్యూచర్‌పై ఆయన డిస్కస్ చేశారు. దీంతో, చాలా మంది ఉద్యోగులు తమ జాబ్స్‌ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ రెండు గ్రూపుల వారు మాత్రం సురక్షితంగా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగాలు చేసేవారు, న్యూరోడైవర్జెంట్లు మాత్రమే ఎలాంటి ఆందోళన లేకుండా గడపొచ్చు. ఈ రెండు వర్గాల వారికి మాత్రం ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారిలో సాధారణంగా ప్లంబర్లు, టెక్నిషియన్లు, మెకానిక్ వంటి రోల్స్ ఉంటాయి. ఇలాంటి వారికి వృత్తి పరమైన శిక్షణ అవసరం పడుతుంది. దీంతో, ఈ వృత్తులను ఆటోమేట్ చేయడం కష్టమని భావిస్తారు. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణతో వీటికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ వృత్తి ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే ఛాన్స్ లేనందున వీటని సేఫ్ జాబ్స్‌గా ఆంథ్రోపిక్ రీసెంట్ నివేదిక సైతం పేర్కొంది. న్యూరోడైవర్జెంట్ వ్యక్తులు ఏఐ నుంచి సురక్షితంగా ఎందుకు ఉండగలరో అలెక్స్ కార్ప్ వివరించారు. న్యూరోడైవర్సిటీ అనేది సాధారణంగా ADHD, ఆటిజం, డిస్‌లెక్సియా, ఇతర పరిస్థితులను కలిగి ఉండే ఒక పదం. తన సొంత డిస్‌లెక్సియా గురించి బహిరంగంగా మాట్లాడిన కార్ప్, న్యూరోడైవర్జెంట్ వ్యక్తులు మరింత క్రియేటివ్ సొల్యూషన్స్ కనుగొనగలరు. కాబట్టి, భవిష్యత్తులో వారు ఒక అదనపు ప్రయోజనాన్ని పొందగలరు. ఎక్కువగా ఆర్టిస్టులా ఉండగలిగే, విషయాలను భిన్నమైన కోణంలో చూడగలిగే, ప్రత్యేకమైన దాన్ని నిర్మించగలిగే వారినే విజయం వరిస్తుంది. టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్, పేపాల్ కో ఫౌండర్ పీటర్ థీల్ సైతం ఈ క్యాటగిరీకి చెందినవారే. పాలంటిర్ సంస్థ గతేడాది డిసెంబరులో ప్రత్యేకమైన 'న్యూరోడైవర్జెంట్ ఫెలోషిప్'ని స్టార్ట్ చేసింది. సంప్రదాయ అభ్యర్థుల కంటే భిన్నంగా ఆలోచించే ప్రతిభావంతులను ఈ ఫెలోషిప్‌కి ఎంపిక చేస్తోంది. లాస్ట్ స్టేజ్ ఇంటర్వ్యూలో కార్ప్ స్వయంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఏఐ భర్తీ చేయలేని ఉద్యోగాల గురించి వ్యూహాత్మకంగా చర్చించారు. అమెరికా, పశ్చిమ దేశాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో న్యూరోడైవర్జెంట్ వ్యక్తులు అసమానమైన పాత్ర పోషిస్తారంటూ ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu