Ad Code

శ్రీలంకకు 38 వేల మెట్రిక్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను పంపిన భారత్‌


తీవ్ర చమురు కొరతతో ఇబ్బందిపడుతున్న లంకను ఆదుకునేందుకు సుమారు 38 వేల మెట్రిక్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను అత్యవసర సాయం కింద భారత్‌ సరఫరా చేసింది. భారత్‌ పంపిన ఈ భారీ నిల్వలలో 20 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌, 18 వేల మెట్రిక్‌ టన్నుల పెట్రోల్‌ ఉన్నాయి. ఈ ఇంధన నౌకలు ఇప్పటికే కొలంబో ఓడరేవుకు చేరుకున్నట్లు భారత హైకమిషన్‌ వెల్లడించింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడి, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ తర్వాత ఈ సహాయం వేగవంతమైంది. సంక్షోభ సమయంలో అండగా నిలిచినందుకు శ్రీలంక ప్రభుత్వం, అక్కడి ప్రజలు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా భారత్‌ చేసిన ఈ ఉదారమైన సాయాన్ని కొనియాడారు.

Post a Comment

0 Comments

Close Menu