Ad Code

ఏఐ సాంకేతికతను వినియోగించి వేగంగా శ్రీవారి దర్శనం అందే విధంగా కొత్త నిర్ణయాల అమలు


శ్రీవారి దర్శనం వేగంగా అందే విధంగా కొత్త నిర్ణయాల అమలుకు టీటీడీ సిద్దమైంది. ఇందుకోసం సాంకేతికతను వినియోగించే విధంగా కార్యాచరణ సిద్దం చేసింది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్నా, భక్తులకు వేగంగా దర్శనం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగించి రెండు గంటల సమయంలోనే శ్రీవారి దర్శనం కలిగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీఫీషియల్ కెమేరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన నిర్ణయాల అమలు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూ లైన్లు, కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తుల రద్దీని గమనిస్తూ నియంత్రణతో పాటుగా వేగంగా క్లియర్ చేసే విధంగా సిబ్బందికి సూచనలు ఇవ్వనున్నారు. తాజాగా వైకంఠ ఏకాదశి నాడు ప్రారంభించి పది రోజుల పాటు నిర్వహించిన ఉత్తర ద్వార దర్శనం సమయంలోనే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని గమనిస్తూ క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టం అమలు చేసారు. ఆలయ పరిసర ప్రాంతాలు, మాడ వీధుల్లో ఈ ఏఐ ఆధారిత కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా భక్తుల కదలికలను తెలుసుకోనున్నారు. ఈ సీసీ కెమెరాలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో డ్యూటీలో ఉన్న అధికారులు నిరంతరం భక్తుల రద్దీ ఎలా ఉందనే విషయాలను గమనిస్తూ వేగంగా దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఇటీవల రధసప్తమి సందర్భంగా కూడా మాధవీధుల్లో ఈ ఏఐ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవడం వల్ల భక్తులు గంటల పాటు దర్శనం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu