ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తన చేతులమీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిన విషయాన్ని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన సాయం గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2019 తర్వాత జరిగిన పరిణామాలు, ఎదురైన ఇబ్బందులను వివరించారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించాలని వెంకయ్య నాయుడు కోరారు. ఈ విషయంపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. తన మంత్రిత్వ శాఖ నుంచి అన్నీ క్లియర్ అయ్యాయని, క్యాబినెట్‌లో పెట్టి ఆమోదించడం ఒక్కటే మిగిలింది అని అమిత్ షా అన్నట్లు వెంకయ్య తెలిపారు.
0 Comments