అమెరికాలోని హవాయి రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కౌవాయి దీవిలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతమైన 'కలలౌ బీచ్' సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. హవాయి రాష్ట్రంలో ఉన్న అందమైన పర్యాటక ప్రాంతమైన కలలౌ బీచ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయమై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 'ఎయిర్ బోర్న్ ఏవియేషన్' సంస్థకు చెందిందని అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా? లేక వాతావరణ పరిస్థితులా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో హెలికాప్టర్ కూలి ముగ్గురు దుర్మరణం : ఇద్దరికి తీవ్ర గాయాలు
by Telugu Lo Computer at March 28, 2026
Labels:
Helicopter Crash in the US Claims Three Lives
,
helicopter reportedly lost control and crashed.
,
island of Kauai
,
state of Hawaii
,
two seriously injured
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment