Posts

Showing posts with the label various speculations are circulating on social media and within film industry circles

ఇన్‌స్టాలో అందరినీ అన్‌ఫాలో చేసిన నటుడు రిషబ్ శెట్టి

Image
క న్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి దాదాపు అందరినీ అన్‌ఫాలో చేసి, ప్రస్తుతం కేవలం మూడు అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో మొదటిది ఆయన భార్య ప్రగతి శెట్టి అకౌంట్ కాగా, మిగిలిన రెండు ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘రిషబ్ శెట్టి ఫిల్మ్స్’, ఆయన స్వచ్ఛంద సంస్థ ‘రిషబ్ శెట్టి ఫౌండేషన్’ ఖాతాలు కావడం విశేషం. రిషబ్ శెట్టి ఇలా అందరినీ అన్‌ఫాలో చేయడానికి గల అసలు కారణంపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జై హనుమాన్’ లోనూ, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్’ లోనూ నటిస్తున్నారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులపై పూర్తి ఏకాగ్రత పెట్టేందుకే ఆయన సోషల్ మీడియా పరధ్యానానికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు. అంతకుముందు ఆయన తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థను, ఆ చిత్రంలో నటించిన తన అత్యంత ఆప్తమిత్రుడు రాజ్ బి. శెట్టిన...