Posts

Showing posts with the label We Will Deal Decisively with Those Who Do Not Lay Down Arms

ఆయుధాలు వీడని వారి అంతు చూస్తాం : మావోయిస్టులకు అమిత్ షా హెచ్చరిక

Image
న క్సలిజం నిర్మూలనపై లోక్ సభలో చర్చ మెుదలైంది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు. బస్తర్‌లో ప్రస్తుతం మావోలు లేరని మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వెల్లడించారు. బస్తర్‌లో ఆదివాసీలకు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధి దిశగా బస్తర్‌ ప్రాంతం ముందుకెళ్తోందని తెలిపారు. మావోల లొంగుబాటుకు రేపే ఆఖరి తేదీ అని, అభివృద్ధి లేదంటూ ఆయుధాలు పట్టుకోవడం సరికాదని హితవుపలికారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని ఈ సందర్భంగా అమిత్ షా హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలో విలీన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్‌ పాలనలోనే గిరిజన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. వారి పాలనలో బస్తర్‌ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని.. గిరిజనులను 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌ విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే దేశంలో మావోయిజం పెరిగిందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు.