Posts

Showing posts with the label M.K. Stalin filed his nomination from the Kolathur constituency

నామినేషన్‌ దాఖలు చేసిన సీఎం స్టాలిన్‌, విజయ్‌

Image
త మిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఎంకే స్టాలిన్ ఇవాళ కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్‌ ఓ పుస్తకం విడుదల చేశారు. "మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్‌ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్‌ నామినేషన్ సమర్పించారు. విజయ్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి ...