తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న తక్షశిల ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడం పెద్ద ఊరటనిచ్చింది. భారీ ప్రమాదం క్షణాల్లో తప్పింది. నిజానికి ప్రమాదం తీవ్రతను చూసిన వారు పెద్ద ప్రమాదమే జరిగేదని అభిప్రాయపడ్డారు. దీనితో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా కొంతసేపు యావర్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దానితో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
0 Comments