Posts

Showing posts with the label Fortunately

స్కూల్ బస్సును ఢీకొట్టిన అద్దె ఆర్టీసీ బస్సు : తప్పిన పెను ప్రమాదం

Image
తె లంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న తక్షశిల ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడం పెద్ద ఊరటనిచ్చింది. భారీ ప్రమాదం క్షణాల్లో తప్పింది. నిజానికి ప్రమాదం తీవ్రతను చూసిన వారు పెద్ద ప్రమాదమే జరిగేదని అభిప్రాయపడ్డారు. దీనితో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా కొంతసేపు యావర్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దానితో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Image
ఆం ధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌ బస్సు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది సొంతూళ్లకు వెళ్లడానికి ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. కొవ్వూరు- రాజమండ్రి బ్రిడ్జిపైకి చేరిన వెంటనే మంటలబారిన పడింది. సెల్ఫ్‌ మోటార్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ దేవకుమార్‌, సీఐ విశ్వం తెలిపారు. ఇంజిన్, డాష్ బోర్డు నుంచి పొగ వెలువడటంతో ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌ బస్సును నిలిపిసి, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. సకాలంలో వారందరూ కిందికి దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానకి చేరుకొని మంటలు అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 80 లక్షల రూపాయల...