Posts

Showing posts with the label Major accident averted

స్కూల్ బస్సును ఢీకొట్టిన అద్దె ఆర్టీసీ బస్సు : తప్పిన పెను ప్రమాదం

Image
తె లంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న తక్షశిల ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడం పెద్ద ఊరటనిచ్చింది. భారీ ప్రమాదం క్షణాల్లో తప్పింది. నిజానికి ప్రమాదం తీవ్రతను చూసిన వారు పెద్ద ప్రమాదమే జరిగేదని అభిప్రాయపడ్డారు. దీనితో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా కొంతసేపు యావర్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దానితో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఎయిరిండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి : తప్పిన పెను ప్రమాదం

Image
నా గ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 విమానానికి పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్‌లో సౌండ్‌ రావడంతో గుర్తించిన పైలట్‌ విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు. నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. విమాన మరమ్మతులకు అధిక సమయం అవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు.మరో వైపు, హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు ఇండిగో విమానాలను దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. పశ్చిమ బెంగాల్‌, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.