Ad Code

సుందర్ పిచాయ్ కి ఉద్యోగుల వినూత్న నిరసన : లే ఆఫ్ చేయాల్సి వస్తే, స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకునే అవకాశాన్ని కల్పించాలి

ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గూగుల్ కొంతకాలంగా భారీగా పెట్టుబడులు పెడుతోంది. మ్యాన్ పవర్ ను దశలవారీగా తగ్గిస్తోంది. ఈ క్రమంలో సంస్థ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి ఉద్యోగుల నుంచి వినూత్నమైన నిరసన ఎదురైంది.”సంస్థ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ భాగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఉద్యోగులను ఘోరంగా తొలగిస్తోంది. ఇది సరైన విధానం కాదు. ఉద్యోగులకు మెరుగైన భద్రత కల్పించాలి. కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. లే ఆఫ్ చేయాల్సి వస్తే, ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకునే అవకాశాన్ని కల్పించాలి. ఉద్యోగానికి కోల్పోతున్న వారికి సరైన స్థాయిలో సేవరన్స్ ప్యాకేజీ కల్పించాలి. ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలి. వారి పనితీరు విధానంలో మార్పులు చేపట్టాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానం వల్ల చాలామంది నష్టపోతున్నారని” ఉద్యోగులు సుందర్ కు ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు. గూగుల్ క్యాంపస్ బయట దాదాపు 100 మంది ఉద్యోగులు ఇలా శాంతియుతంగా నిరసన చేపట్టడం గూగుల్ చరిత్రలోనే అతిపెద్దది. ఉద్యోగ భద్రత కోసం జరిగిన అతిపెద్ద ఉద్యమంలో ఇది ఒకటి అని గూగుల్ సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. సుమారు 4500 మందికి పైగా ఉద్యోగులు సుందర్ పిచాయ్ కి పిటిషన్ ఇవ్వడం విశేషం.. వారంతా కూడా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేశారు. పనులు వేగంగా.. సులభంగా పూర్తవుతున్నప్పటికీ.. తమ భవిత మొత్తం నాశనం అవుతోందని ఆ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ సంస్థలో గతంలో అనేక సందర్భాలలో ఉద్యోగులు అనేక అంశాల మీద నిరసనలు చేపట్టారు. అయితే ఈసారి మాత్రం కాస్త విభిన్నంగా నిరసన నిర్వహించారు. ఉద్యోగులు మొత్తం తమ ఉద్యోగం గురించే ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. 

Post a Comment

0 Comments

Close Menu