'ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌' సేవలను అధికారికంగా ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్‌

Telugu Lo Computer
0

ఫ్లిప్‌కార్ట్  'ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌' సేవలను అధికారికంగా ప్రారంభించింది. వినియోగదారులకు మెరుగైన, సౌకర్యవంతమైన డిజిటల్ క్రెడిట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘పేయూ ఫైనాన్స్’ భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలను అందిస్తోంది. ఈ ప్రత్యేక సదుపాయం కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే కాకుండా, మైంత్రా, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉండనుంది. వినియోగదారుల సౌకర్యార్థం ‘పే లేటర్’ విభాగంలో మూడు రకాల చెల్లింపు ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. !) పే లేటర్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత 30 రోజుల గడువులోగా బిల్లు చెల్లించే సదుపాయం. 2) పే ఇన్ 3 ద్వారా కొనుగోలు చేసిన బిల్లు మొత్తాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు విడతల్లో చెల్లించే వెసులుబాటు. 3) సులభ వాయిదాల ఈఎంఐ ద్వారా ఖరీదైన ఉత్పత్తులకు 3 నుంచి 12 నెలల కాలపరిమితి కలిగిన ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్‌తో పాటు తక్కువ ధర ఉత్పత్తుల కొనుగోళ్లకు కూడా ఈ ఈఎంఐ వర్తిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, వాలెట్లు, ఈఎంఐ మరియు క్యాష్ ఆన్ డెలివరీ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా ‘పే లేటర్’ జతకావడంతో వినియోగదారులకు ఆర్థికంగా మరింత వెసులుబాటు కలగనుంది. ‘ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్‌’  కంటే ముందే ఈ కొత్త సర్వీస్‌ను ప్రకటించడం విశేషం. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్, ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్ సభ్యులకు ఆగస్టు 7 నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, ఈ సేల్ సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపిన వారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default