Ad Code

రేపు కోయంబత్తూరులో రామ్‌చరణ్‌కు మణికట్టుకు సర్జరీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సర్జరీను ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్‌లో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేయనుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, అనంతరం రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu