Ad Code

విలువైన సమయాన్ని నెగెటివిటీ కోసం వేస్ట్ చేయడం అవివేకం : అభిమానులకు అల్లు అర్జున్ సలహా

హైదరాబాద్ లో జరిగిన ఫ్యాన్ మీట్ లో అల్లు అర్జున్ అభిమానులతో మాట్లాడుతూ  ట్రోలింగ్ పై క్లియర్ గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు విలువైన సమయాన్ని నెగెటివిటీ కోసం వేస్ట్ చేయడం అవివేకం అని, మన ఎనర్జీని పాజిటివ్ గా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య అనవసర వాదనలు లేదా ఫ్యాన్ వార్స్ లో పడి సమయం నష్టపోకండి అని కూడా ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు నచ్చిన పని చేయడం బెటర్ అని సలహా ఇచ్చారు. మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చున్నా పర్వాలేదు, కానీ ట్రోల్స్ కోసం టైమ్ వేస్ట్ చేయకండి అని హాస్యంగా చెప్పారు. నచ్చని వ్యక్తుల కోసం డబ్బు ఖర్చు పెట్టరు కదా, అలాగే సమయాన్ని కూడా వృథా చేయకూడదని ఆయన ఉద్దేశ్యం. ఎవరైనా ట్రోల్ చేస్తే దానికి రియాక్ట్ అవ్వడం కంటే మీ గోల్ పై ఫోకస్ చేయడం మంచిది అని అన్నారు. ప్రతి ఒక్కరికీ రోజులో 100% శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీని మీ పర్సనల్ గ్రోత్ కోసం ఖర్చు చేయండి అని అభిమానులకు గైడెన్స్ ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu