తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని రాయిపేట గ్రామ శివారులోని పొలాల్లో కరెంటు మెయిన్ లైన్ తెగి పడడంతో ఐదు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. చెన్నూరు పట్టణానికి చెందిన గొల్ల మధు మేకలు కాసేందుకు తన మేకలను మేతకు తీసుకొని వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాయిపేట గ్రామం వద్ద విద్యుత్ శాఖ గురై తన మేకలు మృతి చెందాయని పేర్కొన్నాడు. తన జీవనాధారమైన మేకలు మృతి చెందడంతో సుమారు 60 వేల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని మేకల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన సమయంలో పరిసర ప్రాంతాలలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదే ఎవరైనా మనుషులు విద్యుత్ షాకు గురైతే ప్రాణాపాయం జరిగి ఉండేదని స్థానికులు మండిపడ్డారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన మేకలు చనిపోయాయని మేకల యజమాని మండిపడ్డాడు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు గల కారణాలను సేకరిస్తున్నారు.
పొలాల్లో తెగిపడిన కరెంటు తీగలు : ఐదు మేకలు మృతి
Wednesday, July 29, 2026
000 Loss Five Goats Die Mancherial district outskirts of Raipeta village in Chennur Mandal Snapped Power Line stimating a financial loss of approximately ₹60 telangana
No comments:
Post a Comment